భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ కుమార్ సంతాప సభకు ఆయన పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డ కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని, వారి త్యాగాలు మరువలేనివని మంత్రి అన్నారు. నిరంతరం దేశ రక్షణ కోసం సరిహద్దులో సాహసం చేసి సమరంలో వీరమరణం పొందిన వీర జవాన్లకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
అమర జవాన్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘననివాళి - santhosh babu
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ కుమార్ సంతాప సభలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం సాహసం చేసి వీరమరణం పొందిన అమర జవాన్లకు మంత్రి నివాళులర్పించారు.
కర్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల సాయం, సంతోష్ భార్యకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. అంతేకాకుండా గల్వాన్ ఘర్షణల్లో ప్రాణాలు అర్పించిన 19 మంది సైనిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఆమెడ కిషన్, ముత్యం సంతోష్ గుప్తా, నూకల దయాకర్, చిలమంతుల సంజీవ్, పలువురు ఆర్య వైశ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆకట్టుకున్న పాసింగ్ అవుట్ పరేడ్