ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం మాడేగాం వద్ద ప్యాకేజీ-27 పెండింగ్ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ప్యాకేజీ-27 ద్వారా 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎప్పుడో పనులు ప్రారంభించినా... అనివార్య కారణాల వల్ల పనులు నిలిచిపోయాయని అన్నారు.
కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులకు ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ
కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఇప్పటికే 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులకు టెండర్లు పిలిచారు. ప్యాకేజీ-27 తో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని అన్నారు.
ఇప్పటికే 60 శాతం పైగా పనులు పూర్తి అయ్యాయని.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రీటెండర్ పిలిచి మరొక ఏజెన్సీకి పనులు అప్పగించామని తెలిపారు. మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, ఏజెన్సీ కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నిత్యం రైతుల గురించి ఆలోచిస్తారని... వారి శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్యాకేజీ 27, 28 పనులు, చెక్ డ్యాంలు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, భూగర్భ జలాలూ పెరుగుతాయని చెప్పారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా