తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

నిర్మల్ జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ పాలకవర్గానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Minister Indrakaran Reddy attending the Nirmal Municipality meeting
జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

By

Published : Jan 27, 2021, 3:38 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రం అయిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నాలుగు సంవత్సరాల్లో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మున్సిపల్ పాలకవర్గానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పురపాలికలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గతంలో మున్సిపాలిటీలలో విద్యుత్ బిల్లులు బకాయిలు ఉండేవని, ప్రస్తుతం నిధుల కొరత లేదని అన్నారు.

ఇదీ చదవండి:రసాభాసగా మారిన నగరపాలిక సర్వసభ్య సమావేశం

ABOUT THE AUTHOR

...view details