స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్ గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిపిన శివపార్వతుల కల్యాణానికి మంత్రి హాజరయ్యారు.
రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
నిర్మల్ జిల్లా బాబాపూర్‌లోని రాజరాజేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. దేవాలయాల వల్ల ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్
దేవాలయాల వల్ల ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని... మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, తహసీల్దార్, సర్పంచ్ శ్రీవిద్య, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.