రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నదాతలకు అవసరమైన సాగు నీటిని సీఎం కేసీఆర్ అందిస్తున్నారని... 24 గంటల పాటు కోతల్లేని నాణ్యమైన కరెంటుని ఇస్తున్నారని తెలిపారు.
రైతు కోసమే...
మార్కెట్ యార్డ్‌కు వెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం రైతుకు ఇబ్బంది అవుతుంది కాబట్టే గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు వరి ధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు.