నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని తారోడా గ్రామంలో నూతనంగా నిర్మించిన 33 / 11విద్యుత్ సబ్ స్టేషన్‌ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
'అదే ముఖ్యమంత్రి కేసీఆర్... మొదటి ఆదేశం' - indra kiran reddy inaugurated power sub station in nirmal
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ఆదేశమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
'అదే ముఖ్యమంత్రి కేసీఆర్... మొదటి ఆదేశం'
ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చురుకుగా వ్యవహరిస్తున్నారని మంత్రి కొనియాడారు. నియోజకవర్గంలో మరెన్నో అభివృద్ధి పనులకు మార్చి వరకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ తొలి ఆదేశం గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడమేనని మంత్రి వెల్లడించారు.