నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం సందర్శించారు. వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఉచితంగా టీకా పంపిణీ చేస్తోందని తెలిపారు.
Minister indrakaran reddy: వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - minister indra karan reddy latest news
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి పరిశీలించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన వారంతా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సర్కారు పారిశుద్ధ్య కార్మికులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి టీకా ఇస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. ఒకవేల వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా