కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విశేషమైన సేవలందించారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు తెరాస పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడటం కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారని మంత్రి అన్నారు.
Food distribution: పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం - నిర్మల్ లో పారిశుధ్య కార్మికులకు ఆహార పంపిణీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో తెరాస పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు... మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులకు మంచి రుచికరమైన భోజనం అందించిన శ్రీహరిరావును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పూదరి అరవింద్, గాజుల రవి కుమార్, భూరాజ్, గడ్డింటి ప్రశాంత్, సంజీత్ రెడ్డి, గణేష్, అజహర్, కోనేటి ఆనంద్, చైతన్య, కృష్ణ సాయి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు