కొవిడ్ మహమ్మరిపై పోరులో.. పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల సేవలు ఎనలేనివని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తోన్న నిర్మల్ మున్సిపాలిటీ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. స్థానిక ఐకేఆర్ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 550 మంది నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
Minister Indra Karan: 'కరోనా కట్టడిలో వారి కృషి ఎనలేనిది' - minister Indra Karan reddy news
కొవిడ్ సంక్షోభంలో(Covid crisis) ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వర్కర్ల (Frontline workers) రుణం తీర్చుకోలేనిదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తోన్న నిర్మల్ మున్సిపాలిటీ సిబ్బందిని ఆయన కొనియాడారు. ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
minister indrakaran
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి ప్రస్తావించారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేస్తోన్న.. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్ల (Frontline workers) రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:Minister niranjanreddy: నకిలీ విత్తనాలు అమ్మితే.. కేసులే: నిరంజన్ రెడ్డి