తెలంగాణ

telangana

ETV Bharat / state

Indrakaran reddy: రైతు వేదికను ప్రారంభించిన మంత్రి - మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని వ్య‌వ‌సాయ మార్కెట్​లో రూ.20 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన‌ రైతు వేదిక‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) ప్రారంభించారు.

minister indra karan reddy
indrakaran reddy: రైతు వేదికను ప్రారంభించిన మంత్రి

By

Published : Jun 3, 2021, 3:38 PM IST

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంద‌ని గుర్తించిన సీఎం కేసీఆర్(CM KCR)… ఆ దిశ‌గా వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధ‌న్య‌త‌నిస్తూ వారికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నార‌ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. గురువారం నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని వ్య‌వ‌సాయ మార్కెట్​లో రూ.20 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన‌ రైతు వేదిక‌ను మంత్రి ప్రారంభించారు.

క‌రోనా క‌ష్ట కాలంలో కూడా రైతుల‌కు వానాకాలం సాగుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా… ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయం అందిస్తుంద‌న్నారు. ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డ‌బ్బులు జ‌మ అవుతాయ‌ని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను స‌కాలంలో అందించేందుకు అధికారులు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారు. కార్యక్ర‌మంలో రైతుబంధు స‌మితి జిల్లా క‌న్వీన‌ర్ న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నిర్మ‌ల్ మార్కెట్ క‌మిటీ ఛైర్​ప‌ర్స‌న్ న‌ర్మ‌దా ముత్యం రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Paddy In Water:ఎడతెరిపి లేని వర్షం... తడిసి ముద్దవుతున్న ధాన్యం

ABOUT THE AUTHOR

...view details