నిర్మల్ జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ 181వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, ఖానాపూర్, ముధోల్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్లు హాజరయ్యారు.
'సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా' - సేవాలాల్ 181వ జయంతి వేడుకలు
సంత్ సేవాలాల్ 181వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై... సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
'సేవాలాల్ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా'
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బంజారా కులస్తుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి... పోడుభూముల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి