తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ నాయకత్వంలో అగ్రగామిగా తెలంగాణ' - telangana formation day in nirmal district

నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

telangana formation day in nirmal district
'కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ'

By

Published : Jun 2, 2020, 3:40 PM IST

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్​లో అవతరణ వేడుకలు జరిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆచార్య కొండా బాపూజీ లక్ష్మణ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్, సాగు నీరందిస్తూ సీఎం అన్నదాతలకు అండగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారి ముషారఫ్ ఫారూకి, జడ్పీ ఛైర్​పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details