నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్టు నిలిచిపోవడానికి గల కారణాలను గుత్తేదారుని అడిగి తెలుసుకున్నారు.
సదర్మాట్ బ్యారేజీని సందర్శించిన ఇంద్రకరణ్ రెడ్డి - sadarmat barrage in nizamabad
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో బ్యారేజీ పనులను పరిశీలించారు.
సీఎంవో స్మితా సబర్వాల్ నిర్మల్ పర్యటన
మంత్రితో కలిసి సీఎంవో స్మితా సబర్వాల్ ఏరియల్ వ్యూ ద్వారా సదర్మాట్ ప్రాజెక్టును పరిశీలించారు. పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతితో పాటు ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: వైకల్యమే సిగ్గుపడేలా.. తోటివారికి సమానంగా..