తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్

నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.

minister-indira-reddy-visited-the-families-of-the-deceased-two-young-men-in-nirmal
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్

By

Published : Dec 22, 2020, 12:12 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. బస్ డిపో వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని పాన్ గల్లీ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ప్రమాద వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులు పరామర్శించారు.

ఇదీ చదవండి:వణుకుతున్న రాష్ట్రం... పెరుగుతున్న చలి

ABOUT THE AUTHOR

...view details