సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని రాహుల్ నగర్లో పట్టణ ప్రగతిలో భాగంగా కోటి 50 లక్షల నిధులతో నిర్మించిన వైకుంఠదామం ప్రారంభించారు.
భైంసాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ - భైంసా పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు.
నిర్మల్ వార్తలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన మొదటి వైకుంఠదామం ఇదేనని మంత్రి అన్నారు. శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భైంసా పట్టణంలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భైంసా మున్సిపల్ వైస్ ఛైర్మన్ జాబీర్ హైమద్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Vaccine : వ్యాక్సిన్‌తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్