తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్‌ బాధిత అట‌వీ సిబ్బంది కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం' - కొవిడ్​తో మృతి చెందిన అటవీ శాఖ అధికారులకు ఆర్థిక సాయం

కొవిడ్​తో మృతి చెందిన అటవీశాఖ ఉద్యోగులు కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. విధినిర్వ‌హ‌ణ‌లో ఉండగా కొవిడ్​తో మృతిచెందిన అట‌వీ ఉద్యోగులకు నిర్మ‌ల్ జిల్లాలోని కార్యాల‌యంలో నివాళుల‌ర్పించారు.

Telangana news
నిర్మల్​ వార్తలు

By

Published : May 20, 2021, 2:14 PM IST

నిర్మ‌ల్ జిల్లాలో కొవిడ్​తో మృతి చెందిన ఐదుగురు అటవీ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అందరూ తలో కొంత వేసుకుని రూ. 2లక్షల 50 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి చేతుల మీదుగా అందించారు. తోటి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవడాన్ని మంత్రి అభినందించారు.

అటవీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని... ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని సకాలంలో అందేలా చూస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ఛైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, క‌వ్వాల్ ఫీల్డ్ డైరెక్ట‌ర్ వినోద్ కుమార్, అట‌వీ శాఖ అధికారులు వికాస్, లావ‌ణ్య‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:స్థిరాస్తి రంగంపై రెండో దశ కరోనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details