కరోనా లాంటి విపత్కర సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా అందిస్తోందని... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 140 మంది లబ్దిదారులకు రూ.కోటి 40 లక్షల విలువైన షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. సర్వమత సంప్రదాయాలను గౌరవించాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు.
'కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు' - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
సర్వమత సంప్రదాయాలను గౌరవించాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని... మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 140 మంది లబ్ధిదారులకు రూ. కోటి 40 లక్షల విలువైన షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
రంజాన్ కానుకలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హిందువులకు దసరా, క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్ కానుకలను బేధాభిప్రాయాలు లేకుండా... సీఎం కేసీఆర్ ఇస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. పేద ముస్లింలకు రంజాన్ పండుగ కానుకలను కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో కలిసి పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: సువేందుకు షాక్- నందిగ్రామ్‌లో దీదీ జయకేతనం