ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు భూములకు మొదటి పంట పెట్టుబడి సహాయం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి' - cheque distribution in nirmal
నిర్మల్ జిల్లా కేంద్రం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు భూములకు మొదటి పంట పెట్టుబడి సహాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భూమి కొనుగోలు పథకం కింద మంజూరైన మూడు ఎకరాల వ్యవసాయ సాగు భూములకు మొదటి పంట పెట్టుబడి సహాయం కింద నిర్మల్ నియోజకవర్గంలో నల్దుర్తిలో ఏడుగురు, కుస్లీలో ఇద్దరు, కౌట్లకేలో ఐదుగురికి మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ. 5లక్షల 9వేల 540 విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్ఆర్ఎస్'
TAGGED:
నిర్మల్ జిల్లా వార్తలు