ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాంసింగ్ తండాలో నూతనంగా నిర్మించిన.. శ్రీ జగదాంబ సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
‘ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి’ - Allola latest news
ప్రజలంతా భక్తి మార్గంలో నడవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లాలో శ్రీ జగదాంబ సేవలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దైవ మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, ఆలయాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తే.. ఎప్పటికీ నిలిచి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో.. ఆలయాలకు మహర్దశ చేకూరిందని అన్నారు. సేవాలాల్ బోధనలు అనుసరించి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలన్నారు.