తెరాస హయాంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక ఆలయాలను నిర్మించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పొట్యా గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ, సార్గమ్మ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవమూర్తులకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
Minister indrakaran reddy: తెలంగాణ ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్ రెడ్డి - పొట్వా సార్గమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పొట్వాలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ, సార్గమ్మ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామాల్లో ఆలయాలు నిర్మించడం వల్ల ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500 నూతన ఆలయాలను నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. మల్లన్న ఆలయానికి 10 లక్షలు, ముత్యాలమ్మ, సార్గమ్మ ఆలయాలకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, అడెల్లి ఆలయ చైర్మన్ అయిటి చందు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా