తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి' - Nirmal district latest news

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాలానాధికారి ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అధికారులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లు, రెండు పడకల గదులు, మిషన్ భగీరథ పనులు గడువులోగా చేపట్టాలన్నారు.

minister-allola-indrakaran-reddy-held-a-meeting-with-officials-at-the-nirmal-district-collector-office
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం

By

Published : Mar 4, 2021, 10:57 PM IST

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు, రెండు పడకల గదులు, మిషన్ భగీరథ పనులు గడువులోగా చేపట్టాలని పేర్కొన్నారు. అధికారులు జాప్యం వహిస్తే ఉపేక్షించేదీ లేదని హెచ్చరించారు.

సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాలానాధికారి ముషారఫ్ ఆలీ ఫారూఖీ, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. డబుల్​బెడ్​రూం ఇళ్లు 6,686 మంజూరయ్యాయని తెలిపారు. పూర్తైన భవనాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి తుది నివేదిక వారంలోపు ఇవ్వాలని సూచించారు.

త్రాగు నీరు, విద్యుత్, తదితర సదుపాయాలు కల్పించి ఏప్రిల్ నాటికి గృహప్రవేశం చేసేలా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రిలో మౌలిక సదుపాయాలపై హెచ్​ఆర్సీకీ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details