నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బొరిగాం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరి పంట మద్దతు ధర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: మంత్రి అల్లోల - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బొరిగాంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: మంత్రి అల్లోల
గత సంవత్సరం కంటే ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని.. పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రైతు వేదికలు పూర్తయిన తర్వాత రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. రైతులను సంఘటితం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:ఔరా..! అచ్చం కార్పెట్లానే ఉందే..!
TAGGED:
nirmal district latest news