తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసర ఆలయంలో వ్యాపారుల ఆందోళన

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వ్యాపారులు ఆందోళనకు దిగారు. లాక్​డౌన్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో తాము చెల్లించిన లీజు సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Merchants in Basra Sringeri Saraswati Temple were agitated
బాసర ఆలయంలో వ్యాపారుల ఆందోళన

By

Published : Jun 6, 2020, 7:42 PM IST

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వ్యాపారులు ఆందోళనకు దిగారు. లాక్​డౌన్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత పెరుగుతున్నందున.. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో తాము చెల్లించిన లీజు సొమ్మును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆలయ ఛైర్మన్ శరత్ పాఠక్, ఈవో వినోద్ రెడ్డిల ఎదుట తమ సమ్యలను వెల్లడించారు. కరోనా నిబంధనల కారణంగా.. ఆలయంలో అక్షరాభ్యాసాలు భారీగా తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీజు సొమ్ము వెనక్కి ఇవ్వనియెడల.. మరో 3 సంవత్సరాలు అదనంగా పొడిగించి టెండర్లు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details