నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లు జరిగిన సమయంలో చిన్నారులు భయాందోళనకు గురయ్యారని, వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరండే కోరారు. అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'భైంసా అల్లర్లలో నివాసం కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించాలి'
నిర్మల్ జిల్లా భైంసా బాధితులను బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరండే పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'భైంసా అల్లర్లలో నివాసం కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించాలి'
భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించిన పరండే... నివాసం కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అల్లర్లు జరిగిన సమయంలో 11 మందిని తమ ఇంట్లో దాచి రక్షించిన మహిళను సన్మానించాలని అధికారులకు సూచించారు.
- ఇదీ చూడండి :భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..