తెలంగాణ

telangana

By

Published : May 29, 2020, 3:48 PM IST

ETV Bharat / state

ఉచిత మెడికల్​ క్యాంప్​ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ

నిర్మల్​ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సాయుధ దళ కార్యాలయ ఆవరణలో ఉచిత మెడికల్​ క్యాంప్ నిర్వహించారు.​ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతున్నామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.

medical camp for police in nirmal district
ఉచిత మెడికల్​ క్యాంప్​ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతున్నామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అవసరమైన వారికి మందులు, ఎనర్జీ పౌడర్ ప్యాకెట్లను అందజేశారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యులు మెుత్తం 150 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతారని ఎస్పీ అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది కరోనా వైరస్ వ్యాధి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. నిర్మల్ జిల్లాలో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, తదితర అధికారుల సమన్వయంతో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్ట గలిగామని ఎస్పీ పేర్కొన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పోలీసులు ముందువరుసలో ఉంటారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు పోలీస్​ సిబ్బందికి ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు, ఎనర్జీ డ్రింక్స్ దాతల సహాయంతో తరచూ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పోలీసుల దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు. వైద్య సేవలు అందించిన వైద్యులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్టు కాళేశ్వరం :కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details