నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి వైద్య బృందం, భైంసా వైద్యుల సహకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు, భైంసా పట్టణంలోని అల్లర్ల బాధితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో వైద్య శిబిరం - latest news on SP Shashidhar Raju
భైంసాలో ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి, భైంసా వైద్యుల సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో వైద్య శిబిరం
కొద్ది రోజుల క్రితం భైంసా పట్టణంలో జరిగిన అల్లర్లలో కొందరు భయాందోళనకు గురికావడం వల్ల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే భైంసాలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి :డీసీసీబీ, డీసీఎమ్మెస్ డైరెక్టర్ పదవులపై సీఎం కసరత్తు