కరోనా నియంత్రణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు మరువలేనివని మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్ నిర్మల్ జిల్లా కో ఆర్డినేటర్ శనిగారపు కమలాకర్ అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఆయన ఎన్95 మాస్కులు అందజేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా పోలీసు, వైద్యశాఖ ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని కమలాకర్ కొనియాడారు.
'కరోనా నియంత్రణలో పోలీసులు, వైద్యుల కృషి అభినందనీయం' - nirmal district news
నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసులకు ఎన్95 మాస్కులు అందజేశారు. కరోనా నియంత్రణలో పోలీసు, వైద్య శాఖ ఉద్యోగుల కృషి అభినందనీయమని మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్ కో ఆర్డినేటర్ కమలాకర్ అన్నారు.
నిర్మల్ డీఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మాస్కుల పంపిణీ
ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు సహకరించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ వసీం, బెజ్జంకి ఇసాక్, ఎండీ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?: హైకోర్టు