నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో సర్పంచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గ్రామంలో ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ.. మాస్క్ ధరించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
ఉచితంగా మాస్కులు పంపిణీ చేసిన సర్పంచ్ - nirmal news
నిర్మల్ జిల్లా జాం గ్రామంలో ఉచితంగా మాస్కులు అందజేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గ్రామంలో ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేసినట్లు సర్పంచ్ మురళీకృష్ణ తెలిపారు.

masks distribution, jam viilage, nirmal district
రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కరిపె విలాస్, పంచాయతీ కార్యదర్శి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి:రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు