తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా  చిత్రీకరించారు

మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఉపాధి నిమిత్తం భర్త గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఆరు నెలల క్రితమే స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. హత్యో, ఆత్మహత్యో తెలియదు గాని ఆమె ప్రస్తుతం చనిపోయింది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

By

Published : Oct 8, 2019, 3:26 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ధని గ్రామంలో సౌమ్య (22) అనే వివాహిత మృతి వివాదాస్పదంగా మారింది. సౌమ్యని అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ - స్వర్ణ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దిలావర్ పూర్ మండలంలోని బన్సపల్లి గ్రామానికి చెందిన సౌమ్యకు ధని గ్రామానికి చెందిన శ్రీనివాస్​తో 2016లో వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం గల్ఫ్​కు వెళ్లిన శ్రీనివాస్ 6 నెలల క్రితం స్వదేశానికి వచ్చాడు. ప్రస్తుతం సౌమ్య 4 నెలల గర్భవతి. మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని... అత్తింటి వారు సౌమ్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు సౌమ్య మృతి అనుమానస్పదంగా ఉందని ఆరోపించారు. అనంతరం భర్త, అత్తమామలే తమ కూతురిని హత్య చేసి ఉంటారంటూ గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అత్తింటి వారిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABOUT THE AUTHOR

...view details