నిర్మల్ జిల్లా ముథోల్ సమీపంలో గత రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అమృత్ పటేల్(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి - latest accident news in mudhole
ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం వల్ల ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ సమీపంలో చోటుచేసుకుంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
లాబ్ధి గ్రామానికి చెందిన అమృత్పటేల్ ముథోల్లో వారసంతకు వెళ్లి, తిరిగి వస్తుండగా బాసర నుంచి భైంసాకు వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదీ చూడండి : థానేదర్ సింగ్ కుష్వా... ఓ తెలివైన దొంగ..!