నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లక్ష్మీ నగర్ తండాలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. అదే తండాకు చెందిన చిన్న రాయుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చిన్నరాయుడిపై శేఖర్ పగతో రగిలిపోయాడు. గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలైన చిన్నరాముడిని భైంసా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అక్రమ సంబంధం తెచ్చిన చేటు... గొడ్డలితో వేటు.. - lokeshwaram mandal
అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా ఓ వ్యక్తిపై గొడ్డలి దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మీనగర్ తండాలో చోటుచేసుకుంది.
అక్రమ సంబంధం తెచ్చిన చేటు... గొడ్డలితో వేటు..
ఇదీ చూడండి: కర్ణాటకలో కారు బోల్తా.. నలుగురు మృతి