తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా ముజ్గి మల్లన్న రథోత్సవం - మల్లన్న జాతర

నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలో మల్లన్న జాతర వైభవోపేతంగా జరిగింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

mallanna jatara in nirmal district
కన్నుల పండువగా ముజ్గి మల్లన్న రథోత్సవం

By

Published : Feb 11, 2020, 10:04 AM IST

నిర్మల్​ జిల్లా ముజ్గిలోని మల్లన్న జాతర వైభవంగా జరిగింది. జాతర ఐదురోజుల్లో భాగంగా ఆఖరి రోజున స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మల్లన్నను దర్శించుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్​, కరీంనగర్​ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి భక్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

స్వామి వారికి పాడి పంటలు సమర్పించుకుని భక్తలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

కన్నుల పండువగా ముజ్గి మల్లన్న రథోత్సవం

ఇదీ చూడండి: హన్మకొండకు చేరుకున్న మేడారం జాతర హుండీలు

ABOUT THE AUTHOR

...view details