నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. అర్ధరాత్రి సుమారు 15 మేకలపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి. తన గొర్రెలు చనిపోవడం వల్ల కాపరి బోరున విలపిస్తున్నాడు. సంఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమపై పిచ్చి కుక్కలు దాడి చేస్తున్నాయని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన మరవకముందే ఇటీవలే ఉపాధి కోసం సౌదీ అరేబీయా వెళ్లొచ్చిన వ్యక్తి స్వదేశానికి వచ్చి జీవనోపాధి కోసం 50 గొర్రెలను, మేకలను పెంచుకుంటున్నాడు.
'నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి'