బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కోసం లక్కీడ్రా నిర్వహించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లక్కీడ్రాలో 1వ తరగతిలో 19విద్యార్థులకు 9మంది బాలికలు, 10మంది బాలురులు ఎంపికైయ్యారు. అలాగే 5వ తరగతిలో 19 విద్యార్థులకు 6గురు బాలికలు, 13మంది బాలురులు ఎంపికయ్యారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కోసం లక్కీడ్రా.. - nirmal district colletor
నిర్మల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కోసం లాటరీ పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1వ, 5వ తరగతులకు 19 విద్యార్థుల చొప్పున మొత్తం 38 మంది బాలబాలికలు ఈ పద్ధతిలో ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కోసం లక్కీడ్రా..
ఎంపికైన విద్యార్థులకు నిర్మల్ పట్టణంలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశంతో పాటు ఉచిత విద్య అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్, ఇతర అధికారులు, విద్యార్థులు, పోషకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: వీఆర్వోపై దాడిని ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగుల నిరసన