నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో జిల్లా ఇంఛార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: ఇంఛార్జి ఎస్పీ ప్రవీణ్ - lock down news
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
నిర్మల్లో లాక్డౌన్
ప్రజల అవసరాల కోసం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. మెడికల్, ఆస్పత్రులకు వెళ్లేవారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఆయనతో పాటు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ ఉన్నారు.
ఇదీ చదవండి: దా'రుణ' యాప్ కేసులో రూ.76 కోట్ల ఆస్తులు సీజ్