నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి ప్రజలతో కిటకిటలాడిన దుకాణాలు.. 10 గంటలకు మూతపడ్డాయి. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
లాక్డౌన్ ఎఫెక్ట్ : నిర్మల్ జిల్లాలో రహదారులన్ని నిర్మానుష్యం - తెలంగాణ వార్తలు
లాక్డౌన్తో నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో లాక్డౌన్, నిర్మల్ జిల్లాలో లాక్డౌన్ ఎఫెక్ట్
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. ప్రజలు బయటకు రావాలని పోలీసులు సూచించారు. పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న వారిని అడ్డుకుని ఇళ్లకు పంపిస్తున్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించి మహమ్మారి బారిన పడకుండా ఉండాలని చెప్పారు.