నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామంలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పంతుల సాయన్న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన ఆయనకు బీపీ పెరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.
బ్రెయిన్ డెడ్‌తో ఉపాధ్యాయుడు మృతి - brain dead news updates in nirmal district
దిలావర్‌పూర్ మండలం సాంగ్వీ గ్రామానికి చెందిన సాయన్న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామంలో ఆయన ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. బీపీ పెరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు.

బ్రెయిన్ డెడ్‌తో ఉపాధ్యాయుడు మృతి
దిలావర్‌పూర్ మండలం సాంగ్వీ గ్రామానికి చెందిన సాయన్న 2008లో నిర్వహించిన డీయస్సీలో ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సాయన్నకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అందరితో కలిసి ఉండే ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇదీ చూడండి: కంటైనర్ అడుగుభాగంలో 436 కిలోల గంజాయి