తెలంగాణ

telangana

ETV Bharat / state

సరిహద్దు గ్రామాలను వీడని భయం.. మళ్లీ చిరుత కలకలం - నిర్మల్​లో పులి సంచారం

సరిహద్దు గ్రామాల ప్రజలను చిరుత పులులు వణికిస్తున్నాయి. అక్కడక్కడా మూగజీవాలను హతమార్చటం... పశువుల కాపర్లకు తారసపడటం... ఆయా గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా... నిర్మల్​ జిల్లా భైంసా మండలంల సిరాల గ్రామ శివారులో రెండు మూగజీవాల కళేబరాలు కన్పించటం వల్ల ప్రజలు మరింతగా భయపడుతున్నారు.

సరిహద్దు గ్రామాలను వీడని భయం.. మళ్లీ చిరుత కలకలం
సరిహద్దు గ్రామాలను వీడని భయం.. మళ్లీ చిరుత కలకలం

By

Published : Dec 25, 2020, 4:43 PM IST

సరిహద్దు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందన్న భయం రైతులతో పాటు, స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామంలో ఒక మేక, కుక్కను హతమార్చడం వల్ల ఈ భయం మరింతగా బలపడింది. అటవీశాఖ అధికారుల బృందం సిరాల గ్రామానికి చేరుకొని మేక, కుక్కను చంపింది చిరుత పులా...? తోడేలా? అన్న విషయాన్ని నిర్ధరించలేకపోయారు. గ్రామస్థులు ఒంటరిగా పంట చేన్లకు వెళ్లవద్దని... గుంపులుగా ఉండాలని అధికారులు సూచించారు.

వారం రోజుల క్రితం తానూరు మండలం బోరిగాం గ్రామ శివారులో కూడా పులి ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. తానూరు మండలం మహాలింగి, బెల్ తరోడ, ఝరి, బోరిగాం గ్రామాల్లో... ముందు నుంచి చిరుత సంచరిస్తుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా అనుమానాలతో... పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details