నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని జంగావ్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి.. పొలాల్లో చిరుత కనిపించడంతో గ్రామస్థులు పశువులను ఊళ్లోకి తీసుకెళ్లారు. చాలా రోజుల తర్వాత మళ్లీ చిరుత సంచారం రైతులను భయాందోళనలకు గురి చేస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. చిరుత పాదముద్రలు పరిశీలించారు.
శివారులో చిరుత సంచారం.. భయం గుప్పిట్లో గ్రామస్థులు - leopard wandering in jangao village
నిర్మల్ జిల్లాలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. జంగావ్ గ్రామ శివారులో చిరుతను గమనించిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పొలాల్లో పశువులను మేపేందుకు జంకుతున్నారు.
మళ్లీ చిరుత సంచారం
గ్రామ శివారులో అడవి పంది కళేబరం కనిపించడంతో చిరుతనే దాడి చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులను 'ఈటీవీ భారత్' వివరణ కోరగా ఈ చిరుత అదే ప్రదేశంలో తిరుగుతూ ఉంటుందని.. పశువులు, మనుషులపై దాడి చేయదని చెప్పారు. సరిహద్దున ఉన్న మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Missing: ఇంటి నుంచి వెళ్లింది... కనిపించకుండా పోయింది