తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులపై అణచివేత ఆపాలి... చర్చలు జరపాలి'

దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా నిర్మల్ జిల్లాలో వామపక్షాలు నిరసన చేపట్టాయి. రైతులపై అణచివేతను ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య కోరారు. రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

left parties protest in nirmal to support farmers strike in delhi
'రైతులపై అణచివేత ఆపాలి... వెంటనే చర్చలు జరపాలి'

By

Published : Dec 5, 2020, 2:02 PM IST

రైతులపై అణచివేత చర్యలు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 8న దేశవ్యాప్త బంద్​ను విజయవంతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:రెండేళ్ల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్​ ధర

ABOUT THE AUTHOR

...view details