నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల నేపథ్యంలో రక్షణ కల్పించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు చలో డీజీపీ కార్యాలయానికి పిలుపునివ్వగా... జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పలువురు నాయకులను సోమవారం రాత్రి ముందస్తు అరెస్టు చేసి... పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిర్మల్ జిల్లాలోని పలు సంఘాల నాయకుల ముందస్తు అరెస్టు! - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘాల నాయకులు చలో డీజీపీ కార్యాలయానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. పలువురు నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.

నిర్మల్ జిల్లాలోని పలు సంఘాల నాయకుల ముందస్తు అరెస్టు!
భైంసా అల్లర్ల ఘటనలో విద్రోహ శక్తులను గుర్తించి అరెస్టు చేయాలని అరెస్టైన నేతలు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్ పరీక్ష