తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.12 లక్షల విలువగల గుట్కా పట్టివేత - large amount of gutka caught

గుట్కాను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఏఎస్పీ దక్షణామూర్తి వెల్లడించారు.

రూ.12 లక్షల విలువగల గుట్కా పట్టివేత

By

Published : Oct 3, 2019, 4:21 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్​కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని ఏఎస్పీ దక్షణామూర్తి తెలిపారు.

మరో ఘటనలో నర్సాపూర్ మండల కేంద్రం వద్ద టాటా వాహనం వేగంగా వెళ్లడం గమనించిన పోలీసులు అతన్ని వెంబడించారు. డ్రైవర్​ను విచారించగా నిర్మల్​లోని ఓ గోదాంలో నిలువ ఉంచిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 లక్షలు ఉంటుందని... మొత్తం 12 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నట్లు వెల్లడించారు.

రూ.12 లక్షల విలువగల గుట్కా పట్టివేత

ABOUT THE AUTHOR

...view details