నిర్మల్ జిల్లా భైంసా మండలం చింతల్ బోరి గ్రామం పక్కన ఉన్న పోచమ్మ కుంటలో చిన్నవి పెద్దవి కలిపి దాదాపు లక్ష వరకు చేపలు మృతి చెందాయి. గ్రామానికి పక్కనే చెరువు ఉండటం వల్ల గ్రామంలోని మురికి నీరు కాలువల ద్వారా చెరువులోకి చేరుతుంది.
భైంసాలో చెరువు లక్ష చేపలు మృతి - Bhainsa Latest News
నిర్మల్ జిల్లా భైంసా బోరి గ్రామం పక్కన ఉన్న పోచమ్మ కుంటలో భారీగా చేపలు మృతిచెందాయి.
భైంసాలో చెరువు లక్ష చేపలు మృతి
ఈ చెరువులో గత సంవత్సరం 50వేలు ఈ సంవత్సరం కొత్తగా 50వేల చేప పిల్లలు వదిలమని మత్స్యకారులు తెలిపారు. చెరువులోకి క్రిమిసంహారక రసాయన మందులు వచ్చి కలవడం వల్లనే మృతిచెందయని అనుమానం వ్యక్తం చేశారు మత్సకారులు. చేపలు చనిపోవడం వల్ల ఆర్థికంగా సుమారు రూ.4 లక్షల వరకు నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని విన్నవించారు. క్రిమిసంహారక రసాయన మందులతో పాటు చెత్తా చెదారం పడవేయడమే చేపలు చనిపోవడానికి ప్రధాన కారణమని మత్స్యకారులు భావిస్తున్నారు.