కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలి' - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి వేతనాలు చెల్లించాలి'
ప్రతి కార్మిక పేద కుటుంబానికి ప్రభుత్వం నెలకు రూ. 7500 చొప్పున మూడు నెలలపాటు ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికుడికి ఆరు నెలల వరకు 10 కిలోల బియ్యం ఇవ్వాలని కోరారు. వలస కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కార్మిక చట్టాల సవరణ 12 గంటల పని దినాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైద్యానికి సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని విన్నవించారు.