తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుమురం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దాం' - కుమురం భీం 80వ వర్ధంతి వార్తలు

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ నాయక్ పోడ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో కుమురం భీం 80వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కుమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుమురం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దామని నాయకులు సూచించారు.

'కుమురం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దాం'
'కుమురం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దాం'

By

Published : Oct 31, 2020, 7:06 PM IST


ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురం భీం 80వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీ నాయక్ పోడ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కుమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జల్‌, జంగిల్,‌ జమీన్‌తో పాటు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గిరిజన వీరుడు కుమురం భీం అని కొనియాడారు.

కుమురం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దామని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె. భీమేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్. శివశంకర్, ఉపాధ్యక్షులు కె. చిన్నయ్య, కార్యదర్శి ముత్యం, సాంస్కృతిక కార్యదర్శి జి. సాయన్న, నాయకులు సీహెచ్ పోశెట్టి, భూమన్న, గంగాధర్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన ముంపు బాధితులు

ABOUT THE AUTHOR

...view details