రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై నిర్మల్ జిల్లా కుభీర్ మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
నూతన రెవెన్యూ చట్టంపై కుభీర్ రైతుల హర్షం - నూతన రెవెన్యూ చట్టంపై కుభీర్ లో ర్యాలీ
నిర్మల్ జిల్లా కుభీర్ మండల రైతులు నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
నూతన రెవెన్యూ చట్టంపై కుభీర్ రైతుల హర్షం
తెలంగాణ చౌక్ నుంచి గ్రామంలోని పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.