నిర్మల్ జిల్లా మామడ మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారంకారుఅదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మహ్మద్ హయజ్కు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య, కుమారునికి స్వల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి కోరుట్లకు తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌కు తీవ్ర గాయాలు - Korutla municipal commisioner Accident in Nirmal District
నిర్మల్ జిల్లా మామడలో జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మహ్మద్ హయజ్కు తీవ్రగాయాలయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌కు తీవ్ర గాయాలు