తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: కోదండరాం - తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కోదండరాం స్పందన తాజా సమాచారం

ఆర్టీసీ ఆస్తులను కాజేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం చర్చలకు రావట్లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిర్మల్​లో ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ లేని లోటు నేడు సమాజంలో కనపడుతోందని అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: కోదండరాం

By

Published : Oct 24, 2019, 6:18 PM IST

ఆర్టీసీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: కోదండరాం
ఆర్టీసీ ఆస్తులను కాజేయాలనే కుట్రతోనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో చర్చలకు ముందుకు రావడం లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న ఆర్టీసీ జేఏసీ నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీ యాత్రలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ లేని లోటు సమాజానికి కనపడుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, కో-ఆపరేటివ్ సంస్థల డబ్బులు ఆర్టీసీ యాజమాన్యం వాడుకొందని విమర్శించారు. దీంతో కార్మికులు లోన్ తీసుకోలేక తమ పిల్లల చదువులకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. సమ్మెకు ముందు నిర్మల్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు రోజుకు 18 లక్షలు జమ చేస్తే ప్రస్తుతం సమ్మెలో ఆరు లక్షలు మించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details