తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy Nirmal Tour : 'రైతుల భూములతో వ్యాపారం చేయడానికే నిర్మల్ మాస్టర్​ ప్లాన్​ తీసుకొచ్చారు' - Nirmal District Master Plan Controversy

Kishan Reddy Nirmal Tour : నిర్మల్​ మాస్టర్​ ప్లాన్​ (Nirmal master plan ) రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి చేస్తోన్న నిరహార దీక్ష విరమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. నిర్మల్​లో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని మహేశ్వర్​రెడ్డికి సూచించారు. జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడుతున్న మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ శ్రేణులు తెలంగాణకు ఆదర్శమని కొనియాడారు.

Maheshwar Reddy Strike on Nirmal master plan
Kishan Reddy Nirmal Tour

By

Published : Aug 21, 2023, 10:49 PM IST

Maheshwar Reddy Strike on Nirmal master plan: రైతుల భూములతో వ్యాపారం చేయడానికే నిర్మల్​ జిల్లాలో జీవో నెం.220ను ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. ఏ అధికారులైతే ఈ జీవో తీసుకొచ్చారో.. వారితోనే జీవోను రద్దు చేయించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని కిషన్​రెడ్డి అన్నారు. నిర్మల్ మాస్టర్​ ప్లాన్​ ప్రణాళిక రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తోన్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. మహేశ్వర్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

మహిశ్వర్​రెడ్డికి నిమ్మరసం ఇస్తోన్న కిషన్​రెడ్డి

Kishan Reddy on Nirmal master plan: జిల్లాలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని కిషన్​రెడ్డి సూచించారు. అనంతరం పోలీసుల లాఠీ చార్జ్​లో దెబ్బతిన్న కార్యకర్తలను పరామర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి బీజేపీ శ్రేణులు తెలంగాణకు ఆదర్శం అన్నారు. మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల పేరిట నిర్మల్​లో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. అనంతరం మాట్లాడిన కిషన్​రెడ్డి.. బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Kishan reddy fires on KCR :ధరణి (Dharani) పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేద రైతుల భూములను దోసుకొందని ఆరోపించారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందన్నారు. ధరణి వలన నష్టపోయిన రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. మజ్లిస్ పార్టీ చేతిలోనే కేసీఆర్​ కీలుబొమ్మలా మారారని ఎద్దేవా చేశారు. నిర్మల్​లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఏ హక్కుతో మంత్రి, కుటుంబ సభ్యుల పేరు మీద ప్రభుత్వం అప్పగించిందని ప్రశ్నించారు. బడా వ్యాపారుల కోసమే కేసీఆర్ ప్రభుత్వం భూములను వేలం వేస్తోందని మండిపడ్డారు.

గత ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్​ప్లాన్ (BC Subplan) నిధులు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్​ రూం ఇళ్లు (Double Bedroom Houses) ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. మోసపూరిత హామీలు ఇచ్చిన కేసీఆర్​కు వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్పాలని సూచించారు. ఈనెల 27వ తేదీన ఖమ్మం రైతు భరోసా ఉంటుందని.. దానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా, జేపీ నడ్డా వస్తారని ప్రకటించారు. సభకు పెద్ద ఎత్తున అభిమానులు, రైతులు హాజరుకావాలని విజ్జప్తి చేశారు. అమర వీరులు కోమురం భీం, రాంజీ గోండు పోరాట స్పూర్తితో రాబోయే రోజుల్లో నిర్మల్​ జిల్లాలో బీజేపీ జెండా ఎగుర వేయాలని కార్యకర్తలకు సూచించారు.

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్‌ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'

Political Analysis on Reasons not Giving MLA Ticket to Rajaiah : రాజయ్యకు టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఇవేనా?

ABOUT THE AUTHOR

...view details