Khanapur MLA Rekha Nayak Resigns BRS :ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో మహిళలకు తగిన గౌరవం ఇవ్వడంలేదని.. అందుకే మహిళ అని కూడా చూడకుండా తనను పక్కన పెట్టరాని ఆరోపించారు. పార్టీ కోసం నియోజకవర్గంలో ఎంతో కృషి చేశారని, అభివృద్ధి కోసం ఆరాటపడ్డారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్‌కు టికెట్ ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Rekha Naik Congress Ticket : కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న MLA రేఖా నాయక్
శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఎలా గెలుస్తారో చూస్తానని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ది చేస్తామని నిధులు మంజూరు చేసి.. ఇప్పుడు ఆ పనులను నిలిపివేసారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీయా లేదా వేరే పార్టీలో చేరడమా.. తదుపరి కార్యచరణను త్వరలో ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Kalwakurthy MLC Kasireddy Resigns BRS :ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు హస్తంపార్టీ బాట పడుతున్నారు. తాజాగా కల్వకుర్తి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తన అనుచరగణంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చంపేట నియోజక వర్గంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.